భీమవరం మండలం రాయలం పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తొలుత పంచాయతీలోని అన్ని గదులను పరిశీలించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాబడి, ఖర్చు వివరాల పట్టికను పరిశీలించి, పలు ఖర్చులపై ఆరా తీశారు. పలు శాఖల అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.