పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి సెంటు భూమి ఇస్తే ఇదేం సరిపోతుందంటూ ఎద్దేవ చేసిన నాయకులు ఇప్పుడు పేద ప్రజలు పూర్తిగా మరిచిపోయారని ఆచంట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రంగనాథరాజు శుక్రవారం అన్నారు. జగన్ ప్రభుత్వం లక్షలాది మందికి ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న పేద ప్రజలు ఇళ్ల కోసం స్పందించకపోవడం శోచనీయం అన్నారు.