తిరుపతి లడ్డూపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. వైసీపీ ఆధ్వర్యంలో మామిడికుదురు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద శుక్రవారం రాస్తారోకో చేశారు. లడ్డూపై సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి దేవి ఆరోపించారు. ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చారు.