'మీ కోసం' కార్యక్రమం సోమవారం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, రెవెన్యూ డివిజనల్, మునిసిపల్, మండల స్థాయిలో అధికారులు తీసుకుని త్వరతగతిన పరిష్కారిస్తారని తెలిపారు.