గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాడు గ్రామ మల్లాయిదొడ్డిలో సోమవారం పల్లె పండుగ కార్యక్రమాన్ని సత్యానందరావు అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.