కార్తీక మాసం రెండోవ సోమవారం కాకినాడలో పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కాకినాడలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంతోపాటు పలు శివాలయాలు తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులేకుండా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.