తూర్పు, పశ్చిమ గోదావరి జల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకట్రావు కోరారు. కాకినాడలో కలెక్టరేట్ కోర్టు హాలులో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకట్రావు మాట్లాడారు.