కూటమి ప్రభుత్వం లో కాకినాడ రూరల్ చెందిన బిసి కులస్తులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కాకినాడ రూరల్ జనసేన కార్యదర్శి, రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి పెంకె రాజు, మాజీ వైద్య ఆరోగ్యశాఖ మౌలిక సదుపాయాల చైర్మన్ యనమదల రవి, మాజీ ఎంపీటీసీ కొండా వినాయక్, పేర్కొన్నారు. సోమవారం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మద్దతుగా పెంకె రాజు ఆధ్వరంలో బీసీ సంఘాల సమావేశాన్ని యనమదల రవి స్వగృహంలో నిర్వహించారు.