ఏలేరు ప్రాజెక్టుకు వరద పెరగడంతో దిగువకు 6000 క్యూసెక్కుల నీరును సంబంధిత అధికారులు సోమవారం విడుదల చేశారు. జగ్గంపేట మండలంలోని ఇర్రిపాక గ్రామంలో ఏలేరు కాలువ గుండ నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో జగ్గంపేట సీఐ లక్ష్మణరావు, తహశీల్దార్ జేవియర్ రమేష్, ఎస్సై రఘునాధరావు అప్రమత్తమయ్యారు. కాలువ పరిసర ప్రాంతాల్లోని పరిస్థితిని సమీక్షించారు. నీటి ఉధృతి పట్ల ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు.