కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో శుక్రవారం మండల అధ్యక్షుడు యాడాలి రాంబాబు ఆధ్వర్యంలో
బీజేపీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నేషనల్ ఫెర్టిలిజర్ స్వతంత్ర డైరెక్టర్,
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట వెంకట సర్వారాయుడు విచ్చేశారు. వారు మాట్లాడుతూ మండలంలో
బీజేపీ సభ్యత్వం అధిక సంఖ్యలో నమోదు కావాలని, అధిక సంఖ్యలో సభ్యులను చేర్చాలని మండల కార్యవర్గానికి దిశానిర్దేశం చేశారు.