ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు ఫీల్డ్ అసిస్టెంట్లు నల్లజర్ల క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. రూ. 26 వేల జీతం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మద్దిపాటి మాట్లాడుతూ. సీఎం దృష్టికి విషయాన్ని తీసుకెళ్తానన్నారు.