గోపాలపురం మండలం సాగిపాడులో శనివారం రాత్రి జరిగిన చోరీ ఘటనపై పోలీసులు ఆదివారం దర్యాప్తు ప్రారంభించారు. ఈ చోరీలో సుమారు 30 కాసులు బంగారం, రూ. 6 లక్షలు అపహరణకు గురైనట్లు పోలీసులు తెలిపారు. దేవరపల్లి సీఐ నాగేశ్వర్ నాయక్ పర్యవేక్షణలో 7 బృందాలు ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. నిందితులను పట్టుకునే దిశగా దర్యాప్తును వేగవంతం చేసినట్లు ఆయన తెలిపారు.