కాకినాడ: రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు సకాలంలో సమర్పించాలి
జిల్లాలో ఖరీఫ్ 2024-25 ధాన్యం సేకరణ ప్రక్రియకు సంబంధించి రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు సకాలంలో సమర్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ లో ఖరీఫ్ 2024-25 సీజన్ ధాన్యం సేకరణ సన్నద్ధతలో భాగంగా జిల్లాలోని రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో జేసీ రాహుల్ మీనా సమావేశం నిర్వహించారు. రైతు సేవ కేంద్రాల ద్వారా రైతులు వద్ద కొనుగోలు చేయాలని సూచించారు.