కాకినాడ: మద్యం షాపులకు లక్కీ డ్రా ద్వారా ఎంపిక
కాకినాడ జిల్లాలో సోమవారం మద్యం దుకాణాల ఖరారును లక్కీ డ్రాతో నిర్వహించారు. 20 నుంచి 10 మద్యం దుకాణాలకు సిండికేట్గా మారి టెండర్లు వేశా రు. జిల్లాలో155 మధ్య షాపులు గాను 3332 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మహిళలు కూడా అధికంగా ఉన్నారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వివేకానంద హాల్లో ఎక్సైజ్ సూపర్డెంట్ కృష్ణకుమారి, ఆర్డీవో మల్లిబాబు మద్యం దుకాణాలకు లక్కీ డ్రా తీసి మద్యం షాపులను ఎంపిక చేశారు.