మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలని సిఐటియు నాయకులు శేషు బాబ్జి, ఏపీ అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు డి పద్మావతి, పి చంద్రవతి పేర్కొన్నారు. శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద ఏపీ అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.