సత్యవేడు మండలంలో 1, 596 గృహాలు నిరుపేదలకు మంజూరు కాగా వాటిలో 617 మాత్రమే ఇంటి పనులు పూర్తి అయ్యాయని శుక్రవారం హౌసింగ్ ఏఈ భాను ప్రకాశ్ పేర్కొన్నారు. మండల పరిధిలో 668 పూర్తి కావాల్సిన ఇండ్లు ఉన్నాయని, వాటిలో 262 పునాదుల వరకు ఉండగా తక్కిన ఇండ్లు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. వివిధ స్థాయిలోని గృహాలన్నింటినీ డిసెంబర్, జనవరి నెలలలో పూర్తి చేసేందుకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.