చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగుకు చెందిన టీడీపీ నాయకులు ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో ఉన్నత పాఠశాల ఆవరణం శుభ్రంగా లేదని దీనితో పిల్లలు ఇబ్బందులు పడుతున్న సంగతిని ఎమ్మెల్యేకి తెలియజేశారు. వెంటనే ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని వారు వినతి పత్రంలో కోరారు.