అప్పు వసూళ్ల కోసం గుంటూరు నుంచి వచ్చిన వ్యక్తి మదనపల్లిలో అదృశ్యం కావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రెండవ పట్టణ సిఐ రామచంద్ర తెలిపారు. గుంటూరుకు చెందిన అశోక్ రెడ్డి అంకి శెట్టిపల్లికి చెందిన కిషోర్ రెడ్డికి రూ 56 లక్షలు అప్పు ఇచ్చాడు. అప్పు వసూలు కోసం ఈనెల 5వ తేదీ మదనపల్లిలో భార్యతో లాడ్జీలో దిగిన అశోక్ రెడ్డి ఆరవ తేదీ నుండి అదృశ్యం కావడంతో భార్య శ్యామల ఫిర్యాదు చేశారు.