భారీ వర్షాల నేపథ్యంలో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాలంటూ చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం ఆదేశించారు. ఎంపీడీవోలు, ఈవో పీఆర్డీలతో సమావేశం నిర్వహించి, పన్నుల వసూళ్లు, పంచాయతీ అభివృద్ధి ప్రగతిని సమీక్షించారు. తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకులను తరచూ శుభ్రం చేయాలని, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.