రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సోమవారం మధ్యాహ్నం పోలీసు అతిథి గృహం వద్ద కలసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతి భద్రతలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ఇతరత్రా అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ,చందోలు పార్లమెంటు తెలుగు మహిళ అధ్యక్షురాలు కార్జాల అరుణ పాల్గొన్నారు.