చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, డిఎస్పీ సూచనలు అనుసరించి, టూ టౌన్ సిఐ నెట్టి కాంటయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం చిత్తూరు ఓబనపల్లి కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్‌లో 32 బైకులు, సరైన వాహన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేయబడినట్లు అధికారులు తెలిపారు. ప్రజల రక్షణ కోసం కొత్త వ్యక్తులు లేదా నేరస్తులు గ్రామంలో ఉంటున్నారా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామని సిఐ పేర్కొన్నారు.