నూతన మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణ పూర్తి అయ్యిందని చిత్తూరు అర్బన్ ఎక్సైజ్ సీఐ శ్రీహరి రెడ్డి శుక్రవారం తెలిపారు. ఇప్పటి వరకు చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలో 14 మద్యం దుకాణాలకు గాను 339 దరఖాస్తులు వచ్చాయన్నారు. గుడిపాల మండలంలో 2 దుకాణాలకు గాను 65 దరఖాస్తులు వచ్చాయన్నారు. జీడీ నెల్లూరులో 4 మద్యం దుకాణాలకు 75, పెనుమూరులో 2 మద్యం దుకాణాలకు 58 దరఖాస్తులు వచ్చాయన్నారు.