చిత్తూరు జిల్లా కేంద్రంలో పోలీసు సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించారు. బాధితుల నుంచి ఎస్పీ మణికంఠ ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 22 ఫిర్యాదులు అందినట్టు పోలీసు అధికారులు తెలిపారు. చట్ట ప్రకారం వాటిని విచారించి సకాలంలో పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.