తిరుపతి రూరల్ మండలంలోని పంచాయతీల్లో సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో చేపడుతున్న హౌస్ హోల్డ్, జియో ట్యాగింగ్ సర్వేలకు ప్రజలు సహకరించి సమాచారం ఇవ్వాలని ఎంపీడీవో కే. రామచంద్ర కోరారు. మండలంలోని వేదాంతపురం, ఓటేరు గ్రామ సచివాలయాలను గురువారం ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మీడియాతో మాట్లాడుతూ ఇంటింటికీ జియోట్యాగింగ్ సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు.