గంజాయి మత్తుకు బానిసలై యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం గంజాయిని పూర్తి స్థాయిలో నివారించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, కొన్ని చోట్ల చాపకింద నీరులా విస్తరిస్తోంది. చంద్రగిరి మండలం అగరాల జగన్నా కాలనీలో ప్లాస్టిక్ బాటిల్స్ లో లిక్విడ్ గంజాయిని నింపి యువత సేవిస్తున్నారు. పాడుబడ్డ భవనాలే అడ్డాగా గంజాయి మత్తులో జోగుతున్నారు. స్థానికులు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయబ్రాంతులకు గురవుతున్నారు.