రోడ్ల నిర్మాణంలో నాణ్యతను పరీక్షించండి: చిత్తూరు కలెక్టర్
చిత్తూరు జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2024-25 సంవత్సరానికి మంజూరు కాబడ్డ అంతర్గత సిమెంట్ కాంక్రీట్ రోడ్ల నిర్మాణంలో నాణ్యతను పరీక్షించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పంచాయతీ రాజ్ ఈఈ చంద్రశేఖర్ రెడ్డిని బుధవారం ఆదేశించారు. జిల్లా సచివాలయంలో సంబందిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ. పూర్తి అయిన పనులకు సంబంధించిన బిల్లులను సత్వరమే అప్ లోడ్ చేయాలని ఆదేశించారు.