చిత్తూరు: ఐదో తరగతి విద్యార్థి ఆత్మహత్య.?
చిత్తూరు జిల్లా కేవీ పల్లి మండలంలోని రెసిడెన్షియల్ పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న రెడ్డి మోక్షిత్ అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనతో కన్న తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. తన బిడ్డ ది ఆత్మహత్య కాదని, తన బిడ్డది ఉరి వేసుకునే వయసా.? ఇంత మంది టీచర్లు ఉన్న ఓ పిల్లాడిని చూసుకోలేకపోయారు అంటూ రోదించింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.