చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభావతి దేవి గురువారం కత్రే పల్లె పిహెచ్ సిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సిబ్బంది హాజరు, ఓపి వివరాలు, ల్యాబ్ టెస్టింగ్స్, మందుల నిల్వ, డెలివరీలు, ఇతర ఆరోగ్య సంబంధిత వివరాలపై సమీక్షించారు. ప్రతి సూపర్వైజర్ పిహెచ్ సిలో వాటర్ క్లోరినేషన్ చేయాలని, ఎపిడీమిక్ సంభవిస్తే వెంటనే రిపోర్ట్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.