నూజెండ్ల మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ సిబ్బందికి శిక్షణ తరగతులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పావులూరు ఉమాదేవి శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యువతకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ఈ సర్వే చేపడుతోందన్నారు. ఈ సర్వే నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ఉపయోగపడుతుందని తెలిపారు.