వేమూరు: బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదు

53பார்த்தது
వేమూరు: బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదు
గ్రామాల్లో బెల్ట్ షాపులు నడిపితే ఉపేక్షించేది లేదని వేమూరు ఎక్సైజ్ సర్కిల్ సిఐ ఏ. రవి తెలియజేశారు. శనివారం వేమూరులో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు వేమూరు మండలంలో బెల్ట్ షాప్ లపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదైతే రూ. 5 లక్షల వరకు జరిమానా విదిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி