మండలంలో పనిచేసే అధికారులు సిబ్బంది నిబంధనలకు లోబడి పని చేయాలని లేదంటే వెళ్ళిపోవచ్చని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు హెచ్చరించారు. బుధవారం పెదనందిపాడు ఎంపీడీవో కార్యాలయంలో మండల సమీక్ష సమావేశంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి సరైన ఏర్పాట్లు చేయలేదని ఎంపీడీవో లక్ష్మీదేవిపై మండిపడ్డారు. ఉపాధి హామీ, విద్యాశాఖ, డ్రైనేజీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.