గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ తెలుగు మహిళ నాయకులు తెదేపా అధిష్టానం పై శనివారం పొన్నూరు తెదేపా కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నూరు ఎమ్మెల్యేగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ 6 పర్యాయాలు గెలిచిన మంత్రివర్గంలో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ స్థానం కల్పించకపోవడం పై వారు దుయ్యబట్టారు. నమ్మకానికి నిబద్ధతకు మారుపేరైన ధూళిపాళ్లనును అధిష్టానం విస్మరించడం పై పలు ఆరోపణలు చేశారు.