నరసరావుపేట భావన కళాశాల ఇంటర్ విద్యార్థిని అనూష ఆత్మహత్యపై ఆదివారం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి నివేదికను కోరారు. పోలీస్ శాఖ, విద్యా శాఖ సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను తక్షణమే పంపాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దురదృష్టకరమైన ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేసి తల్లిదండ్రులకు సానుభూతి తెలిపారు.