నరసరావుపేట మండలం కేసానుపల్లికి చెందిన ఏడుకొండలు గత మే నెలలో నకరికల్లు వద్ద నరసరావుపేటకి చెందిన శ్రీనివాసరావు క్రేన్ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి పరిహారం ఇస్తామని శ్రీనివాసరావు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే పరిహారం అడిగితే శ్రీనివాసరావు బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధిత కుటుంబ సభ్యులు సోమవారం ఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు