గుంటూరు: అత్తింటి ముందు బైఠాయించి యువతి నిరసన
గుంటూరు జిల్లా అరేమండ్లలో అత్తింటి ముందు బైఠాయించి యువతి నిరసనకు దిగిన ఘటన జరిగింది. పొన్నూరు మండలం కట్టెంపూడి గ్రామానికి చెందిన మౌళికను అరేమండ్లకు చెందిన యువకుడితో రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఎంబీఏ చదివిన మౌళిక ఉద్యోగం చేయడం లేదంటూ అత్తింటి వారు పుట్టింట్లో వదిలేశారు. భర్త రెండో పెళ్లి చేయాలనుకోవడంతో, యువతి తన భర్త, అత్తమామలను ప్రశ్నిస్తూ, ఇంటి ముందు నిరసనకు దిగింది. భర్త, అత్తమామలు పరారీలో ఉన్నారు.