సంతమాగులూరు మండలం మిన్నేకల్లు గ్రామంలో వెంకట్రావు అనే వ్యక్తి అక్రమంగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నాడని సమాచారంతో అద్దంకి ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి అతని వద్ద నుంచి 20 మద్యం పార్టీలను స్వాధీనం చేసుకున్నారు. రాబడిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు సిఐ భవాని చెప్పారు. సదరు వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.