అద్దంకి మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి కుటుంబాన్ని "జియో ట్యాగింగ్" చేసే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అద్దంకి మండలం గురువారం నాటికి 75 శాతం పూర్తి చేసి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచిందని మండల ఎంపీడీవో సింగయ్య తెలియజేశారు. ముఖ్యంగా జార్లపాలెం సచివాలయంలో 85% జియో ట్యాగింగ్ పూర్తి చేసినందుకు సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.