అమరావతి సచివాలయంలో సోమవారం అన్నమయ్య జిల్లా ఇంచార్జీ మంత్రితో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్థ చైర్మన్ కె కె చౌదరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాదయాత్రలో కె కె చౌదరి చేసిన కృషి చూశాను, చైర్మన్ గా అవకాశం రావడం సంతోషమని అభినందించారు. వైసిపి ప్రభుత్వంలో కర్నూలు జిల్లాలో ఖాదీ పరిశ్రమల పేరుతో జరిగిన అక్రమాలను వెలుగులోకి తెచ్చి తప్పులను సరిదిద్ది అందరికీ న్యాయం జరిగేలా చూడాలని చూచించారు.