భార్య కాపురానికి రాలేదని భర్త యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడని సోమవారం తంబళ్ళపల్లి పోలీసులు తెలిపారు. చౌడేశ్వరి నగర్ లో ఉండే నాగరాజు (35) భార్య వెంకటేశ్వరమ్మ నెల రోజు క్రితం అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. తిరిగి కాపురానికి రాకపోవడంతో పలుమార్లు కాపురానికి రావాలని అభ్యర్థించాడు. ఆమె తిరిగి రాకపోవడంతో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆసుపత్రికి తరలించారు.