రాష్ట్రమంతట ఆర్టీసీ అధికారులు కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు ప్రకటిస్తుంటే మదనపల్లి ఆర్టీసీ అధికారులు మాత్రం కార్తీక పౌర్ణమి పండుగను పక్కన పెట్టేశారు. మదనపల్లి ఆర్టీసీ అధికారులపై శుక్రవారం భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి మదనపల్లి ఆర్టీసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు వేడుకుంటున్నారు.