రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిన కారణంగా అరెస్టు చేయడం దారుణమని అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాధరెడ్డి అన్నారు. శనివారం రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టే విధంగా పాలన సాగిస్తూ ఉంటే ఆ వైఫల్యాలను వైసీపీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రజలకు చేరవేయడం నేరమా అని అన్నారు.