మండల కేంద్రమైన ఒంటిమిట్టలో ఈనెల 14వ తేదీ నుండి నిర్వహిస్తున్న ఎన్ సి డి సర్వేలో ప్రతి ఒక్కరూ బాగస్వామ్యులు కావాలని, వైద్య సిబ్బందికి సహకరించాలని ఒంటిమిట్ట వైద్యాధికారి హిమ శ్వేత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన స్త్రీ, పురుషులకు స్కానింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. వ్యాధిగ్రస్తులను గుర్తించి తగిన వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు.