పులివెందుల ఇన్స్పెక్టర్ జీవన్ గంగానాథ్ బాబు నల్లపురెడ్డి పల్లెలో శుక్రవారం గ్రామ సభను ఏర్పాటు చేశారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రజలు సాంకేతికతను ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని, ఏలాంటి నేరాల వైపు మరల వద్దని,
ప్రజలకు సూచించారు. యువత ఉన్నత చదువులపై దృష్టి సారించి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్నారు. ఎలాంటి సైబర్ నేరాలకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.