పీఎం సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ఈ రమణ తెలిపారు. శుక్రవారం మైదుకూరు విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పీఎం సూర్య ఘర్ యోజన పథకం ద్వారా రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు, కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నారు.