మదనపల్లి: బైకు నుండి క్రిందపడి యువకుడికి తీవ్ర గాయాలు
గుంతల రోడ్డులో బైకు అదుపుతప్పి కింద పడి యువకుడు తీవ్రంగా గాయపడినట్లు సోమవారం తాలూకా ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. మదనపల్లి మండలం పెంచుపాడు కు చెందిన మదన్ మోహన్ (30) గుంతల రోడ్డులో బైక్ పై వెళుతుండగా కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి వైద్యులు రెఫర్ చేశారు.