మదనపల్లెలో పాత కక్షలతో మహిళపై కత్తితో దాడి
మదనపల్లె మండలం అరవవాండ్ల పల్లికి చెందిన శ్రావణి(25) ఆదివారం రాత్రి పొలం వద్దకు వెళ్లి ఇంటికి వస్తుండగా ప్రత్యర్థులు పూలపాపయ్య, నారాయణమ్మ, పెద్దలక్ష్మి దారిలో శ్రావణిని అడ్డు కున్నారు. ఆమె వారిని తప్పించుకుని రావడంతో, ఇంట్లోకి చొరబడి కత్తులతో పొడచి హత్యాయత్నంకు పాల్పడ్డారు. కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. తాలూకా సిఐ కళా వెంకటరమణ, ఎస్ఐ చంద్రమోహన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.