రైతుల సమస్యలను పరిష్కరించడానికి నెలరోజులపాటు గ్రామ సభలు నిర్వహించి రైతులకు ఉన్న భూమి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని, నిమ్మనపల్లి మండల రెవెన్యూ అధికారి ధనుంజయులు తెలిపారు. శనివారం నిమ్మనపల్లి గ్రామ సభలో పాల్గొన్న ఆయన ఆయా శాఖల అధికారులతో కలిసి ప్రజలు తీసుకువచ్చిన అర్జీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలు పరిష్కరించడానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నామని అన్నారు.