మదనపల్లెలో ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు సామాన్యులను దోచుకుంటున్నాయంటూ ఆదివారం ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తూ ప్రణాణికుల నడ్డి విరుస్తున్నారంటూ వాపోయారు. సీటు కెపాసిటికి మించి కుక్కి తరలిస్తున్నా ఎంవీఐ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఏళ్ల తరబడి మదనపల్లి నుండి బెంగళూరుకు ప్రైవేట్ బస్సుల దందా కొనసాగుతున్న అడిగే నాధుడే లేకుండా పోయాడు. అధికారులు స్పందించాలని కోరారు.