రామసముద్రం మండలకేంద్రంలోని మందుల షాపులను మదనపల్లె డ్రగ్స్ ఇన్స్పెక్టర్ కేశవరెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మత్తుమందు కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన రికార్డులు, మత్తుమందుల తయారీ తేదీ, కాలవ్యవది తేదీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మందుల అమ్మకందారులు, మత్తుమందులను ఎంబీబీఎస్ డాక్టర్ ల సలహాలు సూచనల మేరకే ఇవ్వాలన్నారు.