మోటారు బైక్ కొనివ్వలేదని యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని శుక్రవారం మదనపల్లి తాలూకా ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. సిటిఎం రోడ్డు దేవత నగర్ కు చెందిన యువరాజ్ నాయక్ (20) తన తల్లి బైక్ కొనివ్వలేదని గొడవపడి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.